SRI VAISHNAVA SIDHANTHAM

శ్రీ వైష్ణవ సిద్ధాంతము

శ్రీ వైష్ణవ సిద్ధాంతము

సృష్టి లోని జీవుల యొక్క దేహములు పరమాత్మునిచే సృజింపబడలేదు. జీవుని యొక్క కర్మానుసారముగా ప్రాప్తించినది ఈ దేహము. విశ్వసృష్టి భ్రాంతి మూలకము అసత్యము. కానీ, వైష్ణవ సిద్దాన్తము ప్రకారము దృశ్య మాన జగత్తు అంటే కనిపించే ఈ జగత్తు భగవంతునిచే కాలింపబడినదే. ఒక ప్రధాన విస్తరణ ద్వారా భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ప్రవేశించిన వేద సారస్వతము తెలుపుతుంది. అందుకే సృష్టిలోని ప్రతీ అంశము నందు భగవంతుని అనుభంధమును దర్శిస్తారు. వీరికి బ్రహ్మ మొదలు పిపీలికము ( చీమ) వరకు గలవారందరూ జీవులే. విష్ణువు ఒక్కడే పరమ పురుషుడు. జీవులందరూ పరమాత్మలో అంశములే కనుక జీవునికి ఆత్మ అనే శబ్దము వర్తింప చేస్తారు. కర్మానుసారముగా ప్రాప్తించిన దేహమును భగవంతుని కైంకర్యముగా లబ్ధించిన ధనుంగా వైష్ణవుడు భావించును. అట్టి దేహమును రక్షించుకొనుట భగవంతుని, కైకర్యములో ఒక భాగంగా భావిస్తారు. దేహమును భగవత్ కైకర్య సాధనంగా వినియోగించే క్రమంలో దేహములోని 13 స్థానములను విష్ణుస్థానాలుగా ఊర్ధ్వపుండరములతో గుర్తించుకొనును.

 1. నుదుటి మీద నిలువు బొట్టు - "కేశవ" స్థానము
 2. ఉదరముమీది బొట్టు-"నారాయణ" స్థానము
 3. రొమ్ము మీద బొట్టు-"మాధవ" స్థానము
 4. మెడమీద కంటే ఎముకల మధ్య -"గోవింద" స్థానము
 5. ఉదరము మీద కుడి ప్రక్కన-"విష్ణు" స్థానము
 6. కుడిచేతి మీద -"మధుసూధన" స్థానము
 7. కుడి కంటి ఎముక మీద - "త్రివిక్రమ" స్థానము
 8. కడుపు యొక్క ఎడమ వైపు - "వామన" స్థానం
 9. ఎడమ భుజము మీద - "శ్రీధర" స్థానము
 10. ఎడమ కంటి ఎముక మీద - "హృషీకేశ" స్థానము
 11. వీపు మీద పై భాగము - "పద్మనాభ" స్థానము
 12. వీపు మీద క్రింది భాగము - "దామోదర" స్థానము
 13. శీర్షము పై ధరించునది - వాసుదేవ స్థానము

ఈ విధముగా కర్మానుసారముగా లభించిన దేహములోని విష్ణు తత్వాన్ని స్థాపించుకుని , జీవిత లక్ష్యమైన "తద్విష్ణో పరమ పదం" భౌతిక లోకములకు ఆవల నున్న వైకుంఠ ప్రాప్తికై యాత్ర సాగిస్తాడు. ప్రతీ జీవి హృదయమునందు ఈ తత్వ దర్శనము చేయించ గలిగనదే శ్రీ వైష్ణవ సిద్దాన్తము. స్వీయ ఆరాధన సర్వమత ఆదరణ.

శ్రీమతే రామానుజాయ నమః

లక్ష్మి రామం

<<next>>