వాఙ్మయం గురించి నేర్చుకొందాము

వాఙ్మయం గురించి నేర్చుకొందాము

వాఙ్మయం గురించి నేర్చుకొందాము

రోజు ఆషాఢ పౌర్ణమి, దీనిని "గురుపౌర్ణమి" అని ," వ్యాస పౌర్షమి" అని పేరు .ఈ రోజునే, విష్ణువు అంశతో పరాశరమహర్షికి మత్సగంధికి కలిగిన సంతానం, "శ్రీవేదవ్యాసులవారు". ఈయన అసలు పేరు "కృష్ణ ద్వైపాయినుడు" అని మొదటి పేరు కానీ ఈయన చేసిన ఒక గొప్ప పనిచేశారు. "వాఙ్మయం", అనంతరాశిగా ఉన్న, శబ్ధరాశిని (వేదములను) విభాగం చేసి అందించారు (అవి 4 భాగాలుగా, 1131 శాఖలుగా). ఆ కారణంగా వీరికి “వేదవ్యాసుడు” అని పేరు వచ్చినది. ఈయనే 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, భారతం, భాగవతం బ్రహ్మసూత్రాలును(545) మొదలైన శబ్దరాశిని (వాఙ్మయం) అందించిన మహానుభావులు. ఆయన పుట్టినరోజు, దాని కే సంప్రదాయం లొ తిరునక్షత్రం అని పేరు, ఆషాఢ పౌర్ణమి, దీనికే “గురు పౌర్ణమి “ అని లేదా “వ్యాస పౌర్షమి” అని పేరు . .

ఇప్పడు' "వాఙ్మయం" గురించితెలుసుకొందాము, "వాఙ్మయం" అనగా అర్ధవంతమైనశబ్ధరాశి. ఇట్టి శబ్దరాశికి అభివంజకమైన అక్షరములు గ్రంథాలలో కూర్చబడి ఉన్నందున గ్రంథాలను "వాఙ్మయం" అని వ్యవహరిస్తారు. వాఙ్మయం అనుశబ్ధము రెండుగా విభజించవచ్చు. "వాక్+మయం" అంటే వాక్-ప్రకృతి, మయం-ప్రత్యయం అని. వాక్ అనునది రామాయణ, మహాభారతాది గ్రంథరచనలుగా పరిణమించుట. వాక్కు కంఠాది ప్రదేశంలో ఏర్పడు అభిఘాతసంయెగముతో పుటుచున్నది శభ్దరాశి. ఇది '2' రకాలు. "శ్రీవర్ణణాత్మకమైన" శభ్దం, "ధన్యాత్మకమైన" శభ్దం. వీటిలో, అర్ధవంతమైన శబ్ధము "వాక్" అని అందురు. "తత్స్వరూపము" లైనవి గ్రంథాలుగా వెలువడినవి. ఇట్టి శబ్ధరాశిని "వాఙ్మయం" అని పిలుస్తారు. ఈ వాఙ్మయం '2' గా విభజించబడినది- "అపౌరుషేయ" వాఙ్మయం, "పౌరుషేయ" వాఙ్మయం. వీటిని గురించి తెలుసుకుందాము.

"వాఙ్మయం" అనగా అర్ధవంతమైన శబ్ధరాశి, మన వాక్కు నుండి వచ్చే శబ్దం. నోటి యందు అయాచోట్ల సంయోగం జరిగితే వచ్చే శబ్దం. వ్రాయటానికి వీలు అయితే వాటిని "అక్షరాలు అంటారు. కొన్ని అక్షరాలు కలిస్తే "పదము"లు. కొన్ని పదములు కలిస్తే "వాక్యం". కొన్ని అలాంటివి వాక్యములు కలిస్తే మనం అనే పేరాలు, పేజీలు. వాటిని కొన్ని చేరుస్తే మనం చెప్పుకొనే పుస్తకాలు. వాటిని "గ్రంథాలు" అంటారు!

ఇప్పడు ఇంకో క్రొత్త విషయం చెప్పుకోవచ్చు. ఈ గ్రంథాలను శభ్దరాశి అని వాఙ్మయం అని చెప్పుకోన్నము. అవి '2' రెండు రకాలు. ఒకటి "అపౌరుషేయ" వాఙ్మయం అని, రెండవది "పౌరుషేయ" వాఙ్మయం అని. వీనిలో "అపౌరుషేయ" వాఙ్మయం ఎవరి చేత రచించనబడినది కాదు. స్వతసిద్ధంగా ఉన్న ఒక శబ్ధరాశి. వీటిని నారాయణుడే ఈ సృష్టి పూర్వం చతుర్ముఖబ్రహ్మకు అందించేను (ఉపదేశం చేసేను). వీటికి వేదములు అని పేరు. రెండవది "పౌరుషేయ" వాఙ్మయం అనగా, ఎవరో ఒకరిచేత రచించిన "గ్రంథములు" (శబ్ధరాశి). అవి రామాయణ, భాగవత, భారత, పురాణాది ఇత్యాది గ్రంథాలు. అపౌరుషేయములు గురించి తెలుసుకోవటానికి ప్రయత్నంచేద్దాం.

వాఙ్మయం '2' రకమలు అని చెప్పుకోనాము. అందులో మొదటిది "అపౌరుషేయ" వాఙ్మయం, స్వత సిద్ధమైనది అనగా ఎవరి చేత వ్రాయబడినది కాదు. సృష్టికి పూర్వం, సృష్టికి తరువాత కూడా ఎప్పడు ఉంటుంది. కనుక దీనిని నిత్యము అని శాశ్వతము అని అంటారు. ఇది అనంత శబ్ధరాశి. దీనికే వేదము అని పేరు. దాని '3' భాగములకు "వేదత్రయి" అని పేరు. 1.ఋగ్, 2.యజు, 3.సామ వేదంగా విభాగం చేయబడింది. తరువాత, ఆ '3' బాగములులో చెప్పబడు మంత్రములు యెక్క క్రియ, దాని ఫలితం, ఒకే విధంగా ఉండటంచేత, ఆయా మంత్రములను అన్నీ ఒక చోట చేర్చగా, అది "అదర్వ" వేదంగా పిలవ బడుచున్నది. ఈ వేదమును తిరిగి '1131' శాఖలుగా విభజించిన వారు కృష్ణదైపాయునుడు. ఆ కారణం చేత వీరికి "వేదవ్యాసుడు" అని పేరు కలిగినది. ఇప్పటి కాలంలో, ఇది నేర్చుకోవడానికి, ఒక ఆశ్రమమునకు చేరి, గరువుని ఆశ్రయిస్తే, ఒక శాఖ నేర్చుకోవడానికి సుమారు '12' సంవత్సరాలు పడుతుంది. తిరిగి నేర్చిన ఆ ఒక్కొక్క శాఖలో "పద, క్రమ, జట, ఘన, లక్షణం". ఇది చదవటానికి ఒక్కోక్కదానికి సుమారు '2' సంవత్సరములు పడుతుంది. వీటికి "అంగములు" అని పేరు.ఈ వేదం నేర్చుకోవటానికి '8' సంవత్సరములు వయస్సు గలిగిన బాలునకు ఉపనయన(అర్హతగలిగి) సంస్కారం అయిన తరువాత ప్రారంభము చేస్తారు. ఇంకా ఇందులో విషయం తెలిసు కోవటానికి ప్రయత్నంచేద్దాము...

"వేదం", ఒక శాఖ నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరములు పడుతుంది. మిగిలిన భాగములు చదవడానికి ఇంక ఎంత కాలం పడుతుందో ఊహించండానికే కష్టం. అంత వాఙ్మయంనకు చేందిన జాతి మన జాతి. ఈ వాఙ్మయంనకు "వేదవాఙ్మయం" అని చెప్పుకున్నాము. .దీనిని అనుసరించువారము కనుక "వైదికులు" అని పేరు. (వేదంలో చెప్పు విధంగా నడుచుకొనేవారు అని అర్ధం). ఇలా కాలక్రమేణా, "వైదికులు", అని ఒక వర్గానికి చెందినగా పిలవబడుతుంది. లోకంలో ఒక వ్యక్తి చెప్పుమార్గంలో కొంత మంది ప్రవర్తిస్తే వాళ్ళ అందరిని ఒక్కోక్క పేరుతో ఆయా మతస్ధులు అని పిలవబడినట్లుగా, ఈ వేదము నందు చెప్పినట్లుగా నడిచే వారని "వైదిక" మతస్ధులు అని పిలుస్తారు . ఈ వాఙ్మయం అంతా సంస్కృతంలో ఉన్నది. ఈ వేదం యొక్క అర్దం తెలియాలంటే శిక్ష, వ్యాకరణ, చందస్, నిరుక్తం, కల్పం, జ్యోతిషం తెలిసి ఉండాలి. వీటికి "అంగములు," అని పేరు. ఇవి "'6' పూర్తి అయితేనే వేదం యొక్క అర్ధం చేసుకోవటానికి వీలు అవుతుంది. వీటిలో ఒక్కోక్క అంగం పూర్తి చేయటానికి '2' సంవత్సరాల కాలం అవుతుంది! (ఇలా తీర్చిదిద్దిన ఉత్తారకాచార్యులు, ఉపకారకాచార్యులు అయిన వారికి సదా సాష్టాంగ దండ ప్రణామాలు).

మనం వాఙ్మయం గురించి తెలుసు కుంటున్నము. ఇందులో, '2' కలవు అని, అందులో మెదటిది అయిన అపౌరుషేయ వాఙ్మయం అయిన వేదం, వేదత్రయి అని, వీనిలో కొన్ని బాగములు తీసుకుని అదర్వ(అధర్వణ) వేదం అను పేరుతో వ్యవహరించబడింది అని తెలుసుకున్నాము. ఇందులో మొత్తం '1131' శాఖలుగా ఉన్న ఈశబ్ధరాశిలోని ఒక శాఖ చదవటానికి 12 సం||రాలు పడుతుందని, వేదం యెక్క అర్ధం తెలుసు కోవటానికి '6' అంగాలు నేర్చుకోవాలిని శాఖ, ఒకటి పూర్తి అయిన తరువాత అందలొ బాగము అయిన పదక్రమాది చదివిన తరువాత వారిని మనం ఎక్కడైనా సన్నిధిలలొ వేదపారాయణ చేయువారి అక్కడక్కడ చూడం జరుగుతున్నది. అక్కడ "ఘనాపాఠి" అని, ఒక బిరుదుతో సత్కరిస్తారు. అలాగే బిరుదుతో, పేరు వ్రాసి ఉంచుతారు. అలా నేర్చిన, స్వామి వచ్చి, వారికి ఇచ్చిన సమయంలో వచ్చి పారాయణ చేణస్తారు (మనం లొకంలో ఎవరైనా చదివిన తరువాత ఇంకా అదే (కోర్సు) చదువగా వారకి "డబల్" (Double) అని, తదుపరి వారి చదివిన దానిని ఉదహరిస్తారు (PhD అని, Double MA) అన్నట్లగా . ఈ వేదం "సంహితా" బాగం గాను, "పరాయతం" అని, "ఆరణ్యకం" బాగంగా ఉన్న వీటిని "మూలం" బాగం అని పరిగణిస్తారు. ఇంక వీటిలోనే కలిగి ఉన్న బ్రాహ్మణ బాగము గురించి తెలసుకొందాము.

(ఇవి మాకు (నేర్పిన) చెప్పిన, లేదా అనుగ్రహించిన ఉత్తారకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి, మరియు పరంపద వాసులు శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య స్వామివారు(HYD), మమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన శ్రీమాన్ కోనప్పాచార్య స్వామివారు (RJY), మరియు ప్రస్తుత JIVA అకాడిమి, భక్తినివేద నసంపాదకులు శ్రీమాన్ SVRR స్వామి(కొవ్వూరుస్వామి), వీరిని ఉపకారకాచార్యులు అని కృపామాత్ర ప్రసన్నాచార్యులుగా సంప్రదాయంలో చేప్పుతారు. వీరు నేర్పిన తత్త్వశాస్త్ర విషయాలు నేను గ్రహించన వాటిని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం.) "నాకు నేర్పించిన అస్మద్గురువులకు, ఉపకారకాచార్యులకు సదా అనేక సాష్టాంగదండప్రణామములు" "ఓంనమఃపరమఋషిభ్యోనమః, పరమఋషిభ్యః" , ఇదిమంత్రము పరమాత్మ అందించిన ఆవేదము నందు ఉన్న ఒకమంత్రము అందరు చదివి భగవంతుని అనుగ్రహం, ఋషుల అనుగ్రహం పొందుతారు అని ఆశిస్తున్నాను


కుమార్ రాజా (గోకవరం)
శ్రీపెరుంబుదూర్
Mobile: 9600236704.

<<next>>